లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయబోతున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఇవాళ సీపీ మీడియాతో మాట్లాడుతూ..'అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దు. ఇప్పటి వరకు 3 లక్షల వాహనదారులపై కేసులు నమోదు చేశాం. సీజ్ చేసిన వాహనాలు ఇప్పట్లో ఇచ్చే ప్రసక్తే లేదని' చెప్పారు.
'లాక్‌డౌన్ తర్వాత కూడా వాహనాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కంటైన్మెంట్ ఏరియాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాం. విధుల్లో ఉన్న పోలీసులకు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నాం. పోలీసులకు మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశాం. వలస కూలీల సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇంటి ఓనర్లు..కిరాయిదారులను వేధించవద్దు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే సమాచారమివ్వండి. ఇంటిఓనర్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని' సీపీ పేర్కొన్నారు.