సినిమాలు, సీరియల్స్‌తో బిజీబిజీగా గడిపే ప్రేక్షకులని కార్టూన్ సీరియల్స్ వైపు దృష్టి మరల్చేలా చేసిన గ్రేట్ డైరెక్టర్ జీన్ డిచ్. టామ్ అండ్ జెర్రీ అనే కార్టూన్ సీరియల్‌ని రూపొందించిన ఆయన పాపియో సిరీస్ కూడా తెరకెక్కించారు. ఈ రెండింటితో జీన్ చాలా పేరు ప్రఖ్యాతలు పొందారు. 95 ఏళ్ల వయస్సున్న జీన్ డిచ్ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్‌లో గురువారం రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు.
జీన్ డిచ్ అసలు పేరు యూజీన్ మెరిల్ డీచ్. టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయనకి ఆస్కార్ అవార్డ్ కూడా లభించింది.తొలుత ఉత్తర అమెరికా వైమానిక దళంలో పని చేసిన ఆయన ఆరోగ్య సమస్యలతో బయటకి వచ్చారు. 1959లో ప్రేగ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత చిత్ర కళలపై మక్కువ ఎక్కువతో అనేక కార్టూన్స్ గీస్తుండే వారు. అలా మన్రో అనే చిత్రం తెరకెక్కించారు ఇది 1960లో బెస్టు యానిమేటెడ్ షార్టుఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. జీన్ డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కార్టూనిస్టులే. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా కార్టూన్ సీరియల్స్‌తో ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించిన జీన్ డిచ్ మరణం కార్టూన్ ప్రపంచానికి తీరని లోటు అని అంటున్నారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రతి ఒక్కరు ప్రార్ధిస్తున్నారు.